వైరల్ పిక్; కరోనాపై పోరాటంలో ఈ బొమ్మ చూసారా…?

-

పశ్చిమ బెంగాల్‌లోని పింగ్లా గ్రామానికి చెందిన స్వర్ణకారిణి వేసిన బొమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వైరస్ పై పోరాటానికి సంబంధించి మానవాళి చేస్తున్న యుద్దానికి సంబంధించి ఆమె చిత్రం గీసారు. మహమ్మారి కథను తన కళాకృతి ద్వారా మరియు శ్రావ్యమైన బెంగాలీ పాట ద్వారా వివరించారు. బెంగాల్‌లోని పఠాల మీద చిత్రాలు వేసే వాళ్ళను పాటువాస్ అని పిలుస్తారు.

కాన్వాస్ షీట్స్‌పై వేసే చిత్రాల ద్వారా పౌరాణిక కథలు, సామాజిక సమస్యలు మరియు జానపద కథలను ప్రస్తావిస్తారు. దాని అంతరంగాన్ని చెప్పడానికి ఒక పాటను వాడుకుంటారు. కరోనావైరస్ సంక్షోభంపై తన కొత్త పటాచిత్రాను రూపొందించడానికి గానూ స్వర్ణ చిత్రకర్ ఏడు ఫ్రేములను ఉపయోగించారు. దీనిపై వైరస్, రోగులు మరియు ఆరోగ్య కార్యకర్తల చిత్రాలను చిత్రీకరించారు. ప్రజలు ఇంటి లోపల, బయట ఉన్నవారని…

ముసుగులు ధరించి ఉన్న వారిని చూపిస్తూ బొమ్మ గీసారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో హిపామ్‌సిండియా అనే వ్యక్తి షేర్ చేసారు. రెండు లక్షల మందికి పైగా ఈ వీడియో ని షేర్ చేసారు. పటాచిత్రా ఒక సాంప్రదాయక కళారూపమే కాదు. సామాజిక సమాచారం కూడా అని పేర్కొన్నారు. పటాచిత్ర కళాకారులు చాలా కాలంగా సామాజిక సమస్యలపై బొమ్మలు గీసి పాటలను పాడుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version