తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవ్వాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమావేశం కానున్నారు. 2020 జూన్ 15వ తేదీన చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు విరోచితంగా పోరాడే అమరులయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళ్యాణ్ సంతోష్ బాబు సహా మరో 19 మంది వీర మరణం పొందారు. సంతోష్ బాబు తో పాటు అమరుల అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 2020 జూన్ 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబు ఐదు కోట్ల రూపాయలు మిగతా 19 మంది సైనికులకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ ఆ పరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జార్ఖండ్ వెళ్తున్నారు.