తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్‌గా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని నియమిస్తూ అక్టోబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బుధవారం ఉదయం 10.30కి శాసన మండలిలోని తన ఛాంబర్‌లో చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రోటోకాల్ అధికారులు మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను కూడా కేటాయించారు.కాగా, పట్నం మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే పార్టీ మారినట్లు గతంలో ప్రకటించారు.