నిప్పు క‌ణిక‌లా తెలంగాణ‌.. నేడు 43.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త

-

తెలంగాణ ప్ర‌భుత్వం నిప్పు క‌ణిక‌లా మండుతుంది. గ‌రిష్ట స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. నేడు కూడా తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్య‌ధికంగా ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లాలో ఎండ‌లు ఎక్కువ కొడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో ఈ రోజు అత్య‌ధికంగా.. 43.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ అర్బన్ లో కూడా 43.2 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. అలాగే కొమురం భీం అసిఫాబాద్ జిల్లా లోని కెరమెరి లో ఈ రోజు 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావాలంటే.. జంకు తున్నారు. అలాగే రాష్ట్రంలో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో అధికారులు కూడా అప్ర‌మ‌త్తం అవుతున్నారు. ప్ర‌జ‌లకు ఎండ‌ల నుంచి ర‌క్షణ‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version