బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే…
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. దీని రేటు రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.73,100కు చేరింది. వెండి కొనుగోళు చేయాలనుకునే వారికి ఇది ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధర కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.04 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1813 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్స్‌కు 0.21 శాతం తగ్గుదలతో 25.41 డాలర్లకు పడిపోయింది.
అయితే, గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, ఇతర అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయి.