Business Idea : ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే సూపర్ ఐడియా

-

నేను పులికి తోకలా ఉండటం కంటే.. పిల్లికి తలగా ఉంటాను అని ఓ సినిమాలో డైలాగ్ ఉన్నట్లు చాలా మందికి ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే.. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకోవడమే ఇష్టం. ఒకప్పుడు వ్యాపారం అంటే ఏడు సముద్రాలు ఈదినంత కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రాయితీలు, స్టార్టప్ లకు చేయూత, వెంచర్ క్యాప్టలిజమ్ వంటి విధానాలతో బిజినెస్ చేయడం కాస్త ఈజీ అయింది. ఒకప్పుడు వ్యాపారం చేయడమంటే నష్టాలొస్తాయే భయం ఉండేది.. కానీ ఇప్పుడు రిస్క్ లేని లైఫ్ లో కిక్కు లేదనుకుంటా చాలా మంది యువత బిజినెస్ బాట పడుతున్నారు. అయితే ఏం వ్యాపారం చేయాలనే దానిపై మాత్రం ఓ క్లారిటీ ఉండాలి. బిజినెస్ కు సరైన ప్లానింగ్ ఉండాలి. లేకపోతే ఎంత కష్టపడినా నష్టాలు తప్పవు. మరి ఈ జనరేషన్ లో బెటర్ బిజినెస్ ఐడియాలు ఏంటి.. తక్కువ పెట్టుబడితో సాధ్యమైనంత లాభాలు సంపాదించే ఐడియాలపై ఓ లుక్కేయండి..

ఈ రోజుల్లో ఆహారం, పానీయాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆహార ఉత్పత్తులతో సంబంధమున్న వ్యాపారం చేస్తే ఆదాయం బాగుంటుంది. అలాంటి వ్యాపారాల్లో సోయా పనీర్ తయారీ యూనిట్ ఒకటి. కొంచెం కష్టపడి.. నాణ్యమైన టోఫులను తయారు చేస్తే.. మంచి లాభాలు వస్తాయి. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే. రూ.3 లేదా 4 లక్షల్లోనే ప్రారంభించవచ్చు. యూనిట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే.. వేలు కాదు.. లక్షల్లో సంపాదించవచ్చు.

టోఫు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతాయి. సోయా పన్నీర్ తయారీ కోసం బాయిలర్, జార్, సెపరేటర్, చిన్న ఫ్రీజర్ తదితర పరికరాలకు రూ.2 లక్షలకు వస్తాయి. వీటితో పాటు ముడి సరుకు సోయాబీన్‌కు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. దీని తయారీకి కొంత నైపుణ్యం కూడా అవసరం. కాస్త శ్రద్ధంగా ఈ వ్యాపారం చేస్తే.. మీకు నెల నెలా భారీగా ఆదాయం వస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో సోయా పన్నీర్, సోయా పన్నీర్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. సోయా బీన్స్ నుంచి సోయా పాలు, జున్ను తయారు చేస్తారు. సోయా పాలలోని పోషకాలు, రుచి.. ఆవు, గేదె పాల కన్నా తక్కువే. కానీ వాటితో పోల్చితే ధర తక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. సోయా బీన్‌ చీజ్‌ని టోఫు అని పిలుస్తారు. అనేక సూపర్ మార్కెట్లలో ఇది లభిస్తుంది.

టోఫు తయారీ ప్రక్రియ చాలా ఈజీ. టోఫు తయారీ ప్రక్రియలో.. ముందుగా సోయాబీన్‌ను 1:7 నిష్ఫత్తిలో నీటికి కలిపి మరిగించాలి. బ్రాయిలర్‌లో వేడి చేసి.. గ్రైండర్‌లో రుబ్బిన తర్వాత.. గంట సమయానికి.. సోయా పాల తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. దాని నుంచి 4-5 లీటర్ల పాలు వస్తాయి. అనంతరం పాలను సెపరేటర్‌లో ఉంచుతారు. సెపరేటర్‌లో సోయా పాలు పెరుగులా మారుతాయి. అనంతరం దాని నుంచి పూర్తిగా నీటిని తొలగిస్తారు. సుమారు గంట పక్రియ పూర్తైన తర్వాత.. రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల టోఫు (సోయా పనీర్) లభిస్తుంది. ఇలా మీరు రోజుకు 30-35 కిలోల టోఫును తయారు చేస్తే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశముంది.

టోపు తయారీలో మీకు బై ప్రొడక్ట్ రూపంలో సోయా కేక్ లభిస్తుంది. దీని నుంచి అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. ఈ కేక్‌ని బిస్కెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ప్రారంభంలో తక్కువ సామర్థ్యంతో ప్రారంభించి… ఆ తర్వాత లాభాలు వచ్చేకొద్దీ.. టోఫు తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు మీ ఆదాయం మరింత పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version