సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా ఒక బ్లాగ్ షేర్ చేసింది. ఈ బ్లాగు ద్వారా ఇంట్లో కూర్చొనే ఒలింపిక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. గూగుల్ తమ యూజర్ల కోసం తెచ్చిన ఫీచర్స్ ఏంటో చూద్దాం.
దేశర్యాంకు, ఫ్యూచర్ ఈవెంట్స్, రిక్యాప్ వీడియోస్
ఈ ఫీచర్ ద్వారా గూగుల్ అన్ని దేశాల ర్యాంకు జాబితాతోపాటు జరగబోయే అన్ని ఈవెంట్స్ కు సంబంధించిన సమాచారం క్షణాల్లోనే అందిస్తుంది. దీనికి మీరు ‘ఇండియా ఒలింపిక్స్’ అని గూగుల్లో సెర్చ్ చేస్తే, భారతీయ క్రీడాకారులు ఆడబోయే మ్యాచ్ లకు సంబంధించిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. అలాగే మీరు సెర్చ్ చేసిన దేశానికి సంబంధించిన వార్తలు, వీడియోలు వీక్షించేందుకు ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఒకవేళ మీరు గేమ్స్ చూడటం మిస్సయితే.. ఈ వీడియోల ద్వారా వీక్షించవచ్చు.
గూగుల్ అసిస్టెంట్
ఒలంపిక్స్ పోటీలలో ఎవరు గెలిచారు? అనే ప్రశ్నలకు గూగుల్ అసిస్టెంట్ సమాధానం ఇవ్వగలదు. ‘హే గూగుల్, ఒలింపిక్స్‌లో మహిళల బాస్కెట్‌బాల్ లో ఎవరు గెలిచారు?‘ అని ప్రశ్నించగానే సమాధానం ఇస్తుంది. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.
యూట్యూబ్, గూగుల్ టీవీ
ఈ ఫీచర్ తో మార్కా క్లారో, యూరోస్పోర్ట్ ఛానెల్‌ల నుంచి లైవ్ ఈవెంట్‌లతో పాటు క్లిప్‌లు, ముఖ్యాంశాలను వీక్షించవచ్చు. ‘ఒలంపిక్స్‘ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా… గూగుల్ టీవీ వినియోగదారులు ‘ఫర్ యూ‘ అనే పేజీని విజిట్ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఇతర అప్లికేషన్లు
గూగుల్ ప్లే స్టోర్ లో అధికారిక ఒలంపిక్స్ యాప్ తో పాటు అనేక అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి.