యాత్ర 2 నుండి తొలి సమరం పాట.. అదుర్స్..!

-

దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాని 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల చేశారు. ఆ సినిమా విజయాన్ని సాధించింది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర 2 రాబోతోంది. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని చూపించబోతున్నారు. అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రని కూడా ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించబోతున్నారు.

వైయస్ జగన్ పాదయాత్రతో మొదలయ్యే ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా యాత్ర టు కథ ఉంటుంది ఇందులో వైయస్ జగన్ పాత్రలో జీవ నటిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇంకో పాటని రిలీజ్ చేశారు ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. తొలి సమయం అంటూ సాగే వీడియో సాంగ్ లో జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం వంటివి చూపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version