దర్శకధీరుడు.. జక్కన్న.. ఎస్ ఎస్ రాజమౌళి మరో ఘనత సాధించారు. రాజమౌళి ఓ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఎలక్షన్ ఐకాన్‌గా నియమితులయ్యారు. 2023 కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం రాయచూర్ జిల్లాకు రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించింది. జిల్లాలోని ఓటర్లలందరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రాజమౌళి అవగాహన కల్పిస్తారని ఈసీ వెల్లడించింది. రాయచూర్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.
రాజమౌళి.. రాయచూర్ జిల్లా, మానవి తాలుకాలోని అమరేశ్వర్ క్యాంప్‌కు చెందినవారు. ఆ తర్వాత ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడింది. అందుకే రాయచూర్ కలెక్టర్ చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
“పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాజమౌళి.. దేశంలోని చాలా మందికి సుపరిచితమే. అందుకే రాజమౌళికి ఈ బాధ్యతలకు అప్పగిస్తున్నాం. ప్రజలు ఆయనను సులువుగా గుర్తిస్తారు. రాజమౌళి ప్రచారం చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. రాయచూర్ జిల్లా ఎన్నికల ఐకాన్‌గా ఉండేందుకు రాజమౌళి కూడా అంగీకరించారు” అని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.