కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. దాదాపు 21 రోజులపాటు అనగా ఏప్రిల్ 14 వరకు ఎవరు కూడా బయటికి రాకూడదని కుటుంబ సభ్యుడిగా, దేశ క్షేమం కోసం చెబుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో 31 వరకు అని అనుకొని సినిమా ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్ పాటించగా, తాజాగా కర్ఫ్యూను పొడిగిస్తూ ఏప్రిల్ 14 వరకు అన్ని తెలపడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు కనీవిని కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్మాతలు ఫైనాన్సియర్లకు వడ్డీ చెల్లించే పరిస్థితిలో లేరు.షూటింగులు ఆగిపోయాయి మరోపక్క నటీనటుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి మొత్తం కోలుకునే సరికి…వడ్డీ తడిసి మోపెడవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఫైనాన్షియర్ లు నిర్మాతల దగ్గర వడ్డీలు మరియు చక్రవడ్డీ లు తరహాలో డబ్బులు వసూలు చేస్తే గనుక ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ రాకుండానే నిర్మాతలు ఆత్మహత్యలు గతియే శరణం అని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన ట్రేడ్ వర్గాల వారు.