ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. అయితే, బుడమేరు వాగుకు ఇప్పటికే వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో బెజవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను అధికారులు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు.మరోసారి భారీ వరద వస్తే కాలువకు మళ్లీ గండ్లు పడే అవకాశముండగా.. బెజవాడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సోమవారం విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పంచాయతీలను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ సొంతనిధుల నుంచి రూ.4కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నేతలు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని కోరారు.