అమెరికాలో టోర్నెడోల భీభత్సం.. 100 మంది దుర్మరణం..

-

అమెరికా సంయుక్త రాష్ట్రాలను టోర్నెడోలు(సుడిగాలులు) వణికిస్తున్నాయి. ఇప్పటికే టోర్నెడోల కారణంగా 100 మందికి పైగా మరణించారు. ఆగ్నేయ యూఎస్ దేశంలోని కెంటకీ రాష్ట్రంలో సుడిగాలి కారణంగా
అనేక కౌంటీలు ధ్వంసమయ్యాయని గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. కెంటకీ చరిత్రలోని ఇది అత్యంత భీభత్సమైన టోర్నెడోలు అని ఆయన అన్నారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని భారీ అమెజాన్ గిడ్డంగిని శుక్రవారం తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 100 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. యూఎస్ లో దాదాపు 5 రాష్ట్రాల్లో  టోర్నెడోలు భీభత్సం స్రుష్టిస్తున్నాయి. అర్కాన్సాస్, ఇల్లినాయిస్ మిస్సౌరీ మరియు టేనస్సీల రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా టొర్నెడోలు వస్తున్నాయి. కాగా టోర్నెడోలు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎమర్జెన్సీని విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version