ఆ వ్యాధి సోకితే అందంగా అవుతారట.. కానీ కళ్లకు ప్రమాదమే..!

-

ఏదైనా వ్యాధి వస్తే.. మనుషులు నీరసంగా అవుతారు. ముఖం అంతా పీక్కపోతుంది. ఫేస్‌లో గ్లో ఉండదు. అరే జ్వరం వస్తేనే మళ్లీ ఫేస్ నార్మల్‌గా అవడానికి నాలగు ఐదు రోజులు పడుతుంది కదా.. కానీ ఆ వ్యాధి వస్తే.. జనాలు ఇంకా అందంగా అవుతారట. ఏంటి నమ్మడం లేదా..? ఆ వ్యాధి పేరు టోక్సోప్లాస్మోసిస్ (toxoplasmosis). ఇది టోక్సోప్లాస్మా గోండీ పారాసైట్ (Toxoplasma Gondii parasite) కారణంగా వస్తుంది. ఇదో చిన్న సూక్ష్మక్రిమి. ఈ వ్యాధి సోకితో మనుషులు మరింత అందంగా, ఆకర్షణీయంగా అయిపోతారని అధ్యయనం చెబుతోంది.

ఫిన్లాండ్‌ తుర్కీ యూనివర్శిటీలో జేవియర్ బొర్రాజ్ లియోన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది. టోక్సోప్లాస్మోసిస్ వ్యాధి సోకితే… మనుషులు మరింత ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపించేలా ఈ పారాసైట్లు చేస్తాయని స్టడీస్‌లో తెలిపింది. ఇంతకీ ఈ సూక్ష్మ జీవి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పిల్లి (cat) నుంచి అంట.. అరే ఇదంతా.. పిల్లి నుంచి మనిషిని చేరాక.. ఆ తర్వాత సెక్స్ ద్వారా మనుషుల నుంచి మనుషులకు సోకుతుందట.

అలా ప్రవేశించి..ఇలా చేస్తుందట..

“సెక్స్ ద్వారా మనుషుల్లో ప్రవేశించే ఈ సూక్ష్మజీవి… శరీరంలోకి వెళ్లాక… మనుషులు పైకి కనిపించే రూపాన్ని మార్చేస్తుంది. ఇందుకు కారణం ఈ వ్యాధి వల్ల వచ్చే ఉప ఉత్పత్తి కావచ్చు అంటున్నారు.. జేవియర్ బొర్రాజ్.

ప్రమాదం కూడా ఉంది..

కంటి రెటీనాపై ప్రభావం చూపించే ఈ పారాసైట్… కళ్లలో మంటలు పుట్టించి… శాశ్వతంగా కళ్లలో మచ్చలను తెస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. అందం సంగతి పక్కన పెడితే.. కళ్లుపోతాయ్‌ ఏమోగా..! ఈ వ్యాధి సోకిన 300 మందిని పరిశీలించారు. వ్యాధి సోకక ముందు వారి ఫొటోలను, సోకిన తర్వాత వారి ఫొటోలను గమనిస్తే… ఇలా చూసిన ప్రతిసారీ వారిలో అందం పెరుగుతున్నట్లు తేలిందట.

అందం పెరగడానికి కారణం ఏంటి..?

ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది సైంటిస్టులు కూడా తెలుసుకో లేకపోయారు.. ఈ వ్యాధి హార్మోన్లలలో మార్పులు చేయడం ద్వారా ముఖంలో మార్పులు తీసుకొస్తుందని ప్రధామిక అంచనాకు వచ్చారు. దీనిపై మరింత పరిశోధన జరుపుతామని పరిశోధకులు అంటున్నారు. 2006 నుంచి 2016 వరకూ… 2,47,976 మందికి ఇది సోకగా… 188 మంది చనిపోయారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version