విషాదం: ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం

-

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వరద ప్రభావిత ప్రాంతాలకు రిపోర్టింగ్ కోసం వెళ్లి వస్తూ వరదనీటిలో కొట్టుకుపోయారు. రాయికల్ మండలం బోర్ణపల్లి కి చెందిన తొమ్మిది మంది కూలీలు కర్రులో పత్తి ఎందుకు వెళ్ళి జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఎన్టీవీ జర్నలిస్టు మిత్రుడితో కారులో ప్రయాణిస్తుండగా వారి కారు రామోజీ పేట-భూపతిపూర్ మధ్య కల్వర్టు దాటుతూ ఉండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

ఇందులో జర్నలిస్టు మిత్రుడు బయటపడగా జర్నలిస్టు వాగులో కారుతో పాటు కొట్టుకుపోయాడు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహం లభ్యమైంది. చెట్ల కొమ్మల్లో మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతకు ముందే కారు ఆచూకీ లభ్యం కాగా క్రేన్ సహాయంతో బయటకు తీశారు. రిపోర్టర్ మృతితో కుటుంబ సభ్యులు విలపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version