Telangana : టీచర్స్​కు గుడ్​న్యూస్.. 27 నుంచి బదిలీలు, పదోన్నతులు

-

ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, సమగ్ర షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.

బదిలీల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి మొదలై.. మార్చి 4వ తేదీ వరకు 37 రోజులు కొనసాగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో జనవరి ఒకటో తేదీ నాటికి రెండేళ్లు పూర్తయితే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 317 జీవో ఉపాధ్యాయులకు జీరో సర్వీసు ఇచ్చి బదిలీ చేయాలన్నడిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. పూర్తిస్థాయి కాలపట్టికతోపాటు మార్గదర్శకాలపై జీవోను శనివారం లేదా సోమవారం జారీ చేయనున్నారు.

2018లో బదిలీల కోసం హడావిడిగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడంతో సీనియారిటీలో తప్పులు దొర్లాయి. కోరుకున్న ఆప్షన్‌ దక్కకపోవడం తదితర సమస్యలు తలెత్తాయి. ఈసారి అది పునరావృతం కాకూడదని ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version