ట్రాన్స్ జెండర్ బోనాల దీపిక మర్డర్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

-

ట్రాన్స్ జెండర్ బోనాల దీపికా మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.దీపికను చంపిన సాయి హర్షను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి డిఎస్పి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ..నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.తన చెల్లి దీపికా అనుమానాస్పదంగా చనిపోయిందని ఈ నెల 22న్ కంప్లైంట్ ఇచ్చిన అన్న సాయి హర్ష అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేశాడు.దీపికా హత్యకు పాతకక్షలు, డబ్బులే కారణమని వెళ్లడైంది.

గత మూడేళ్ళుగా దీపికా, సాయి హర్ష రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. బోనాల కోసం మారేపల్లి గ్రామానికి దీపికా, సాయి హర్ష మరో ముగ్గురు యువకులు వచ్చినట్లు తెలిపారు.బోనాల పండుగ అయిపోయిన తరువాత దీపికా, సాయి మద్యం సేవించినట్లుగా పోలీసులు తెలిపారు.రాత్రి మారేపల్లి లో గొడవపడి కారులోనే దీపికను సాయి చంపేసినట్లుగా తెలిపారు.బంధువులకు ఫోన్ చేసి దీపికకి ఫిట్స్ వచ్చిందని నమ్మించి..హైదరాబాద్ లోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు నిందితుడు.కారును అక్కడే వదిలేసి నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version