రైల్లో ప్రయాణం చేస్తారా…? ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే…!

-

దాదాపు 20 రోజుల నుంచి ఒక్క రైలు కూడా నడవడం లేదు. ప్రజలకు ఎంత అవసరం ఉన్నా, అత్యవసరం ఉన్నా సరే బయటకు వెళ్ళడానికి లేదు. లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు అధికారులు ఎవరిని కూడా బయటకు రానీయడం లేదు. దీనితో రైల్వే శాఖ తన సర్వీసులు అన్నీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ తో సంబంధం లేకుండా రైళ్ళను నడపడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 15 నుంచి రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్లీపర్‌ క్లాస్‌(నాన్‌ ఏసీ) కోచ్‌లు మాత్రమే ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అన్నీ కూడా నాన్ స్టాప్ రైళ్ళు నడపాలని భావిస్తున్నారు.

ఒకటి లేదా రెండు స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుంది. అది కూడా ఎక్కువ సేపు కాదు. ప్రయాణం చేసే 12 గంటలకు ముందుగా అధికారులకు ప్రయాణికుడు తన ఆరోగ్య వివరాలను సమర్పించాలి. కరోనా లక్షణాలు ఉంటే మధ్యలో రైలు ఆపి దింపేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బెర్తు ఖరారు అయిన వారికే ప్రయాణం. సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. ప్రయాణం చేసే వారు నాలుగు గంటల ముందే స్టేషన్ కి రావాలి. రైళ్ల‌లో మిడిల్ బెర్తుల‌ను ఖాళీ ఉంచుతారు.

భౌతిక దూరం పాటిస్తూ ప్రధాన౦గా నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళాలి, ధర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అప్పుడే కోచ్ లోకి వెళ్ళాలి. ఫ్లాట్ ఫాం టికెట్లు అమ్మే అవకాశం లేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల తర్వాత గ్లౌజులు, మాస్క్‌లకు, నామమాత్రపు రుసుం వసూలు చేసి మీకు అందిస్తారు. కోచ్‌లోని క్యాబిన్‌కు ఇద్దరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. సైడ్ బెర్తులు ఖాళీగా ఉంటాయి. క్యాటరింగ్ సర్వీసు ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version