అక్ష‌య్ కుమార్ ది రియ‌ల్ హీరో.. మొన్న 25 కోట్లు.. మ‌ళ్లీ ఇప్పుడు భారీ విరాళం..!!

-

క‌రోనా పోరులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేవలం రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని ఈ శ‌త్రువుతో ప్ర‌పంచ‌దేశాలు ఆయుధం లేకుండా అలుపెరుగ‌ని యుద్ధం చేస్తున్నాయి. అయితే దీనికి కొంద‌రు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు త‌మ‌వంతు సాయం చేస్తున్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఒక‌రు.

ఇప్ప‌టికే కరోనా వైరస్‌పై పోరాటం కోసం తన వంతు సాయంగా రూ.25 కోట్ల భారీ విరాళాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించి తన భార్యను సైతం ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా అక్షయ్ మరోసారి భారీ విరాళం ప్రకటించాడు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. మున్సిపల్‌ కార్మికులకు అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ), ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం అక్షయ్ ఈ విరాళం అందించాడు.

ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్మ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇక కరోనా సంక్షభంలోనూ విరామం లేకుండా పనిచేస్తున్న వారికి అక్షయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘మమ్మల్ని, మా కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి.. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తన్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఏదేమైనా రియల్ హీరో అనే ప్రశంసకు తాను పూర్తి అర్హుడనని మరోసారి నిరూపించారు అక్షయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version