హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలిలోని సుమారు 400 ఎకరాల్లో పచ్చిక బయళ్లు ఉండి చిన్నపాటి అటవీ ప్రాంతాన్ని తలిపించేది. ఉన్నట్టుండి రేవంత్ సర్కార్ ఆ భూములను అమ్మేందుకు రాత్రికి రాత్రే జేసీబీలను పెట్టించి వందల ఎకరాల్లో చెట్లను తొలగించింది.
దీంతో అందులో నివాసముండే వన్యప్రాణుల గూడు చెదిరినట్లు అయ్యింది. పక్షులు, నెమళ్లు పెద్ద ఎత్తున అరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే, వందల ఎకరాల్లో పచ్చదనం మొత్తం తొలగించడంతో అందులోని వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి. పెద్దపెద్ద వృక్షాలను కూకటివేళ్లతో పెకిలించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాంగణం వద్ద జింక సంచరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
HCU అప్డేట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం HCUలో సృష్టించిన దమనకాండలో వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్ వద్ద జింక సంచారం#SaveHCUBioDiversity pic.twitter.com/Bi4LAf3sfx
— TNews Telugu (@TNewsTelugu) April 4, 2025