ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుందట. అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

industrial plant for the production of sheet metal in a steel mill – storage of sheet rolls

తొలి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు జరుగుతాయన్నారు. దీంతో 55 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. కాగా ఏపీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం అమలులోకి వచ్చింది. నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా.. ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ మేరకు ఇవాల ఉ.10 గంటలకు మంత్రి అనగాని తొలి విడతగా 26 జిల్లా లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version