తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొదటిసారి మెగాస్టార్ సోదరుడిగా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాతో అక్కినేని నాగేశ్వరావు మనవరాలు సుప్రియ కూడా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది. కానీ తర్వాత ఏ సినిమాలలో కూడా నటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఈ వయసులో కూడా ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా భారీ యాక్షన్ సినిమాలకే ఆసక్తి చూపించడం గమనార్హం.
ఈ అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ట్రెండ్ చేయడానికి మరో సరికొత్త దీక్షతో ముందుకు రావడం జరిగింది..#పవన్ కళ్యాణ్ మాల అంటూ సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండింగ్ న్యూస్ గా మారిపోయింది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు కొంతమంది పవన్ మాల అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు 49 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇలా 49 రోజుల దీక్ష అంటూ మెడలో ఎర్రటి కండువాతో దీక్ష ప్రారంభించనున్నారు. ఇక ఈ 49 రోజులు వీరు ఎటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా కేవలం సమాజానికి ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తూ పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తూ ఉంటారట.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది.
అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ మాత్రం రకరకాలుగా నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
Red Towel Tho 49 Days Pawan Kalyan Mala 😂😂😂😂 …Sainiks 😂😂😂😂pic.twitter.com/u77PSd8rl0
— Ramlal Bharath (@rj_4_all) August 15, 2022