జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలా ఆసక్తి ఉంటుంది. దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, నిర్మాత ఎవరు అనే దాని మీద ఎంతో ఆసక్తి ఉంటుంది. కథ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అభిమానులు ఏదోక వార్త వెతుకుతూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం పనులు మానుకుని కూడా అభిమానులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా కీలక సన్నివేశాల షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక టీజర్ కూడా బయటకు వచ్చింది. ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్న త్రివిక్రమ్ ప్రతీ సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒకరు శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కాగా మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.