నాయకులు దేశానికి ఉపయోగ పడే పనులే చేయాలి. టైం పాస్ పనులు చేసి పబ్లిక్ లో అల్లరి కాకూడదు. రాజమహేంద్ర వరం ఎంపీ మార్గాని భరత్ విషయమై ఇప్పుడు జరిగిందిదే! నెట్లో ఆయన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి..ఆ వైరల్ కథేంటంటే?
అభివృద్ధి పనుల్లో బెస్ట్ అనిపించుకునో లేదా దేశానికి ఖ్యాతి తెచ్చే పనులు చేసే ఎంపీలు మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు అవి కూడా దేశానికి పెద్దగా ఉపయోగం లేని విషయాలు లైమ్ లైట్ లోకి తెచ్చి, వాటిని సెలబ్రేట్ చేసి ఎంపీలు తమ పరువు తామే తీసుకుంటున్నారు.దేశంలో ఉన్న సమస్యలపై మాట్లాడి వాటి గురించి ఇతరులతో చర్చించి,ఓ మంచి పరిష్కారం చూపాల్సిన ఎంపీలు సోషల్ మీడియాలో అక్కర్లేని సందేశాలు ఇస్తూ, పోస్టులు చేస్తూ తామేం చెప్పాలనకుంటున్నారో అన్న విషయమై స్పష్టతే కోల్పోతున్నారు.ఎంపీ మార్గాని భరత్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇన్ స్టా లో ఫాలోవర్స్ దక్కించుకోవడం ఏమయినా పెద్ద విషయామా? పోనీ ఆమె ఏమయినా దేశానికి సేవ చేశారా? దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే పనుల్లో భాగం అయితే మీరు రాయండి ప్రశంసించండి ఎంపీ గారూ ఇలాంటివెందుకు అని కూడా అడుగుతున్నారు ఇంకొందరు.