గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై టీఆర్‌ఎస్ పార్టీ చాలా ధీమాతో ఉంది..ఏది ఏమైనా గ్రేటర్ మేయర్ పీఠం తమదే అన్న ధైర్యంలో ఉన్నారు గులాబీ నేతలు..గ్రేటర్ ఉన్న మొత్తం 150 వార్డులో దాదాపు 53 సీట్లు సాధిస్తే మేయర్ పీఠం కైవసం చేస్తుకొవచ్చన్న ధీమాలో ఉన్నారు గులాబీ బాస్..గత ఎన్నికల్లో గ్రేటర్‌లో దాదాపు 100(99+1) సీట్లు సాధించి..మేయర్ పీఠం సొంతం చేసుకుంది..ఈ సారి గ్రేటర్‌లో పరిస్థితి పూర్తిగా గతంలో కంటే విరుద్ధంగా ఉంది..గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు వస్తున్నాయి..తిరుగులేదనుకున్న టీఆర్‌ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇచ్చారు..నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టారు..అప్పడు మొదలైన టీఆర్‌ఎస్ పతనం కొనసాగుంది..గ్రామ పంచాయితీ,జడ్పీ ఎన్నికల్లో కాస్త టీఆర్‌ఎస్ పుంజుకున్నట్లు కనిపించిన అది తాత్కాలిక ఆనందంగానే మిగిలింది గులాబీ పార్టీకి.
గ్రేటర్ ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఈ సారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి గెలుపొందే వార్డుల సంఖ్య తగ్గవచ్చు అంటున్నారు విశ్లేషకులు..అయితే టీఆర్‌ఎస్ నేతలు మాత్రం గ్రేటర్ పీఠం తమదేనన్న ధైర్యంతో ఉన్నారు..దాదాపు 53పైగా సీట్లు సాధిస్తే మేయర్ పీఠం తమదేనన్న ధీమాలో ఉన్నారు..అది ఏలా అంటే..గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం ప్రతి పక్షాలు సొంతం చేసుకోవాలంటే దాదాపుగా 107-108 డివిజన్‌లో గెలుపొందాలి.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది ఏ ఒక్క పార్టీ అన్ని డివిజన్‌ల్లో గెలుపొందం అంత సులువుకాదు..టీఆర్‌ఎస్ పార్టీపై అసంతృప్తి,ప్రజల్లో వ్యతిరేఖత ఉన్నప్పటికి..వందకుపైగా సీట్లను సాధించగల సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదంటున్నారు.. టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటమి మాత్రం దాదాపు 53 స్థానాల్లో గెలిస్తే మేయర్ పీఠం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నప్పటికీ..మేయర్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకంగా మారనున్నాయి..గ్రేటర్‌లో టీఆర్‌ఎస్,ఎంఐఎం పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు..వీరందరూ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటింగ్‌లో పాల్గొంటారు..గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ దాదాపుగా 43 ఎక్స్‌అఫిషియో ఓట్లు ఉండగా..ఎంఐఎంకు 10, బీజేపీకి 3 ఓట్లు ఉన్నాయి..కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు మాత్రమే ఉంది..ఇది కూడా అవకాశం ఉంటే అధికార పక్షానికే పడే చాన్స్ ఉంది..టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటమికి మొత్తం 53 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి.
ఇక టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటమి మేయర్ పీఠం దక్కించుకొవాలంటే కావాల్సిన మొత్తం డివిజన్లు 53 గెలిస్తే చాలంటున్నారు.
దీంతో గతంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పంచుకునే అవకాశాలు ఉన్నాయి..మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌కు ఇస్తే..డిప్యూటీ మేయర్ ఎంఐఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి..గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసిన మేయర్ పీఠం మనదే అన్న ధీమాలో టీఆర్‌ఎస్-ఎంఐఎం నేతలు ఉన్నారు..గులాబీ బాస్ కూడా అదే ధైర్యంతో ఉన్నట్లు తెలుస్తుంది..మేయర్ పీఠం దక్కించుకున్న తర్వార అనేక రాజకీయ పరిణామాలు జరుగుతాయన్న ధీమాలో ఉన్నారు గ్రేటర్ నేతలు..గ్రేటర్‌పై కమలం జెండా ఎగరేయాలన్న బీజేపీకి ఈ సారి నిరాశే మిగలవచ్చు అంటున్నారు విశ్లేషకులు.