Breaking : పలివెలలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘర్షణ.. ఈసీ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫిర్యాదు

-

రాష్ట్ర రాజకీయమంతా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కేంద్రీకృతమైంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఘర్షణకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

 

పలివెల వచ్చిన బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులే ముందుగా దాడి చేశాయంటూ కథనాలు వినిపించాయి. అయితే ఈ దాడిలో టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా గాయపడ్డట్లు ఫొటోలు విడుదలయ్యాయి. ఇక టీఆర్ఎస్ దాడిలో ఈటల రాజేందర్ పీఆర్వో కాలికి కూడా గాయమవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version