రేవంత్ రెడ్డి పై టీఆర్ ఎస్ అధిష్టానం ఫోక‌స్‌.. కౌంట‌ర్‌కు ఎన్ కౌంట‌ర్..!

-

రేవంత్ రెడ్డి revanth reddy ఎన్ని ఆరోప‌న‌లు చేసినా మొన్న‌టి వ‌ర‌కు క‌నీసం ప‌ట్టించుకోలేదు టీఆర్ ఎస్‌. ఆయ‌న్ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోమ‌ని చెప్పేశారు టీఆర్ ఎస్ అధినేత‌లు. కానీ ఇప్పుడు రేవంత్ టీపీసీసీ చీఫ్ కావ‌డంతో టీఆర్ ఎస్ ఆయ‌న్ను టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే రేవంత్ ఎప్ప‌టికైనా టీఆర్ ఎస్‌కు ముప్పే అని గ్ర‌హించిన కేసీఆర్ ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి /revanth reddy

రేవంత్ చేసే ప్ర‌తి విమ‌ర్శ‌కు, కౌంట‌ర్‌కు రీకౌంట‌ర్ వేయిస్తున్నారు కేసీఆర్‌. అదికూడా కేవ‌లం ఎమ్మెల్యేల‌తోనే ఈ విధంగా కౌంట‌ర్లు వేయిస్తూ ఆయ‌న స్థాయిని త‌గ్గిస్తున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తోనే రేవంత్‌కు ఎన్ కౌంట‌ర్ వేయిస్తూ ఆయ‌న‌కు చెక్ పెడుతున్నారు కేసీఆర్‌.

అయితే రేవంత్ కామెంట్ల మీద ఇట కేసీఆర్ కానీ అటు మంత్రులు గానీ పెద్ద‌గా మాట్లాడ‌ట్లేదు. ఎందుకంటే వారు స్పందిస్తే ఆటోమేటిక్ గా రేవంత్ స్థాయి పెరుగుతుంద‌ని వారికి తెలుసు. అందుకే రేవంత్ ఎన్ని కామెంట్లు చేసినా వాటిని క‌నీసం తాము లెక్క‌లోకి కూడా తీసుకోవ‌ట్లేద‌ని ఇంటిమేష‌న్ ఇస్తున్నారు కేసీఆర్ టీమ్‌. అలాగే రేవంత్‌కు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలో కొంద‌ర్ని కేసీఆర్ ప్రోత్స‌హిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే అనేక చ‌ర్చ‌లు వ‌స్తున్నాయి. మ‌రి రేవంత్ వారి స్కెచ్‌లో చిక్కుకుంటారా లేదా అన్న‌ది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version