ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదం.. ఎమ్మెల్యే స్పందన ఇదీ !

-

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రాంతలలో పర్యటిస్తున్న టిఅర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు గొడవకు దిగారు. మీ పేరు రాసి చ‌నిపోతాం అంటూ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదల్లో చిక్కుకున్న తమని ఎవరు ఆదుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసి, ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోవాలి అంటూ డిమాండ్ చేసారు. అయితే ఈ అంశం మీద తాజాగా ఆయన స్పందించారు.

వర్షాలు మొదలయిన రోజు నుండి నేను నియజకవర్గం లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని ఆయన అన్నారు. మధ్యాహ్నం ఒక మహిళ నాతో సమస్యలు చెప్పిందని కానీ నేను చెప్పేది వినకుండానే నాపై అరిచిందని అన్నారు. నాతో మాట్లాడే వీడియో పథకం ప్రకారం రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసిన వ్యక్తులే రేవంత్ సైన్యం అంటూ దానిని సర్క్యులేట్ చేశారని ఆయన అన్నారు. గన్ మెన్ లు కూడా లేకుండా ప్రజల కోసం తిరుగుతున్నానన్న ఆయన సాధారణ కార్యకర్తలానే ఉంటానని అన్నారు. పని చేస్తుంటే..ఇలాంటి విమర్శలు సహజమన్న అయన మరో 24 గంటల్లో ఇక్కడి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version