ఖమ్మంలో కారుకు ఫుల్ డ్యామేజ్…వాళ్ళు కూడా జంప్?

-

ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు బాగా హైలైట్ అవుతున్నాయని చెప్పొచ్చు…ఇంతవరకు కాస్త సైలెంట్ గా సాగిన రాజకీయం..ఇప్పుడు అనూహ్యంగా హాట్ హాట్ గా నడుస్తోంది. దీనికి కారణం కేవలం టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలే అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి…నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇక ఈ పోరుని తట్టుకోలేక కొందరు టీఆర్ఎస్ నేతలు..కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చూస్తున్నారు.

మామూలుగానే ఖమ్మంలో టీఆర్ఎస్ కు పట్టు లేదు…గత ఎన్నికల్లో 10 సీట్లలో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది…6 కాంగ్రెస్, 2 టీడీపీ, ఒకటి ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అయితే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా 4 గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది..కానీ నిదానంగా జంపింగ్ ఎమ్మెల్యేల వల్ల ముందు నుంచి టీఆర్ఎస్ నేతలు ఇబ్బందే పడే స్టేజ్ వచ్చింది.

పైగా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం నేతల మధ్య పోటీ పెరిగింది. ఈ క్రమంలోనే టికెట్ దక్కదు అనుకునే నేతలు కాంగ్రెస్ లోకి జంప్ కొట్టేందుకు చూస్తున్నారు. ఇప్పటికే అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు…కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఇదే లైన్ లో మరికొందరు నేతలు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇల్లందులో జంపింగ్ ఎమ్మెల్యే హరిప్రియ, టీఆర్ఎస్ నేత కోరం కనకయ్యలకు పొసగడం లేదు. సీటు గాని హరిప్రియకు దక్కే ఛాన్స్ ఉంటే..కనకయ్య కాంగ్రెస్ లోకి జంప్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు మధ్య పోరు ఉంది…టికెట్ దక్కకపోతే పాయం జంప్ అవ్వడం ఖాయం. సత్తుపల్లిలో ఎమ్మెల్యే వీరయ్య, మట్టా దయానంద్ ల మధ్య ఆధిపత్య పోరు ఉంది. మూడుసార్లు గెలిచిన వీరయ్యకే మళ్ళీ టికెట్ ఖాయం..దీంతో దయానంద్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నారు. అలాగే పాలేరులో ఎమ్మెల్యేగా ఉన్న ఉపేందర్ రెడ్డికి మళ్ళీ సీటు ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు తన దారి తాను చూసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఖమ్మంలో కారు నేతలు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version