నా శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ తోనే ఉంటా – టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి

-

నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తోనే ఉంటానని… టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి బిజెపి పార్టీలోకి వెళుతున్నారని.. వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన రంజిత్ రెడ్డిని… బిజెపి పార్టీ కొనుగోలు చేసిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో స్వయంగా టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పారు. తాను ఎప్పటికీ కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని, తనపై కొందరు కావాలని చేస్తున్న ఆరోపణలు, వదంతులను నమ్మవద్దని పార్టీ నేతలు, అభిమానులు సూచించారు. ఆటు మునుగోడులో సర్వేలన్నీ టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version