గ్రేటర్ లో మళ్లీ ఎన్నికలకే టీఆర్ఎస్ మొగ్గు చూపుతుందా ?

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠంపై అదే సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఏకపక్షంగా దక్కించుకోవాలనుకుంది టీఆర్‌ఎస్‌. కానీ.. ఫలితాలు మాత్రం అధికారపక్షానికి ఏ మాత్రం ఆశజనకంగా రాలేదు. ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠం చేజిక్కించుకోని పక్షంలో టీఆర్‌ఎస్‌ ముందు రెండే ఆప్షన్లున్నాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనా లేక అది ముగిసాక మళ్లీ ఎన్నికలా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

GHMC elections 2020 live updates – manalokam.com

గ్రేటర్ పాలక వర్గం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే ఇప్పుడున్న పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుందన్నది ఎంచుకునే ఆప్షన్స్‌ ఏంటన్నది చర్చకు దారితీస్తోంది. అటుఇటు అయిన ఎక్స్‌అఫీషియో సభ్యులతో అయినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గులాబీ దళం లెక్కలేసింది. ఇప్పుడు అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఉన్నా.. మేయర్ కుర్చీలో కూర్చోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. దీంతో ప్రస్తుత పాలకమండలి ముగింపు గడువు దగ్గర పడే కొద్దీ టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుందన్న అంశం సస్పెన్స్ రేకిత్తిస్తుంది.

గ్రేటర్ ఎన్నికలకు ముందు ఎంఐఎం మిత్రపక్షం అని టీఆర్‌ఎస్‌ అప్పుడప్పుడు చెబుతూ వచ్చింది. కానీ.. 150 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. ఎంఐఎం గెలిచే స్థానాల్లోనే బరిలో దిగి.. తన బలాన్ని చాటుకుంది. ఎన్నికల ప్రచారం సమయంలో టీఆర్‌ఎస్‌,ఎంఐఎంలు ఒక్కటే అని బీజేపీ టార్గెట్‌ చేసింది. దీంతో సమీకరణాలు మారిపోయాయి. ఎంఐఎంతో కొంచెం దూరంగానే ఉంటోంది. ఆ గ్యాప్‌ ఇంకా పెరుగుతుందో.. మళ్లీ దోస్త్‌ మేరా దోస్త్‌ అని కలిసి సాగుతారో తెలియడం లేదు.

ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ వాతావరణం వల్ల ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠం తీసుకోలేని పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జరుగుతోన్న విశ్లేషణలపై అధికార పార్టీ పెద్దలు లోతుగా దృష్టిపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే మేయర్‌ విషయంలో ఏం చేస్తారు అన్న ప్రశ్నలకు.. ఇంకా సమయం ఉంది కదా అని సమాధానం దాటవేస్తున్నారట. ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు కాబట్టి …ప్రస్తుత పాలక మండలి సమయం ముగిసిన తర్వాత రాజ్యంగ బద్దంగా జరిగే ప్రక్రియ వైపు టిఆర్ఎస్ మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. స్పెషల్ ఆఫీసర్ పాలనా పెట్టి అది ముగిశాఖ మరోసారి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.

స్పష్టమైన తీర్పుకోసం మళ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ సై అంటే తమ పరిస్థితి ఏంటని కొత్తగా గెలిచిన కార్పోరేటర్లు టెన్షన్ పడుతున్నారు. గెలిచి ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే పదవి పోతే ఎన్నికల్లో పెట్టిన కోట్ల రూపాయాల ఖర్చు బూడిదలో పోసినట్లవుతుందని మదనపడుతున్నారు. పాలకవర్గం గడువు ముగిసేనాటికి అధికారపార్టీ ప్యూహం ఎలా ఉంటుదన్నది ఇప్పుడు గ్రేటర్ లో టెన్షన్ పుట్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version