టిఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి – కిషన్ రెడ్డి

-

బిజెపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని దాన్ని తట్టుకోలేకనే టిఆర్ఎస్ పార్టీ దాడులకు దిగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.బండి సంజయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడిని టిఆర్ఎస్ మంత్రి సమర్థించుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. టిఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి.. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మట్టి కదులుతా ఉంది కాబట్టి ఈ విధమైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచిది కాదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని.. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన మీ కుటుంబ పాలనను ప్రజలు అంతం చేస్తారని అన్నారు. మీ పార్టీని గానీ, మీ నాయకుల్ని గాని, మీ ప్రభుత్వాన్ని గాని ,మీ కుటుంబ పాలన గాని ఎవరూ రక్షించలేరని అన్నారు. అంబేద్కర్ రచించిన ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. మీరు ఎన్ని దాడులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక పెద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తుంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని రక్షించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర పోలీసులదేనని అన్నారు. రాష్ట్ర పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఉండేది ఆరు, ఆరు నెలలు మాత్రమేనని.. రాబోయే ఆరు నెలల్లో తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version