గులాబీ నేతల ఓవర్ పాలిటిక్స్…ముంచడానికే..!

-

ఎక్కడైనా అధికారంలో ఉండే నేతలు అణిగిమణిగి పనిచేయాలి…ప్రజలకు ఎప్పుడు సేవకలు మాదిరిగానే ఉండాలి. వారి సమస్యలని పరిష్కరించాలి. కానీ ఈ ప్రక్రియ అంతా ఒకప్పుడు…ఇప్పుడు మాత్రం అధికారం అంటే పెత్తనం అన్నట్లు రాజకీయ నేతలు ముందుకెళుతున్నారు. ప్రజలపై పెత్తనం చేయడానికే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అడ్డుఅదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ…తమని ఎవరు ఏం చేయలేరనే ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

ఇలా ధీమాతో రాజకీయం చేస్తే…ప్రజలే ఆ ధీమాని తగ్గించేస్తారు. దాని వల్ల అధికార పార్టీ మునుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ నేతల రాజకీయం వల్ల..టీఆర్ఎస్ పార్టీనే మునిగేలా ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌లో వివాదాస్పద నేతలు కాస్త ఎక్కువగానే ఉన్నారు.

ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటూనే ఉంటారు…అలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలు కూడా ఎక్కువగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు తమ సొంత పనులు చక్కదిద్దుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. అలాగే తమకు కావల్సిన వాళ్ళకే పనులు చేయించి పెట్టడం, పథకాలు అందిస్తున్నారట. ఎక్కడైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు ఇవ్వాలి. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు చెప్పిన వారికే పథకాలు అన్నట్లు పరిస్తితి ఉందని విమర్శలు వస్తున్నాయి.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు కావొచ్చు…దళిత బంధు కావొచ్చు…ఇంకా ఏ పథకమైన టీఆర్ఎస్ నేతలు చెప్పిన వాళ్ళకే దక్కుతాయి. ఆ మధ్య ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సైతం…టీఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళకే ఇల్లు కట్టుకోవడానికే మూడు లక్షలు ఇస్తామని చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పింఛన్ల కార్డులను మీటింగ్‌కు వచ్చినవారికి మాత్రమే పంపిణీ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంటే అర్హత ఉన్నవారికి కాదు…టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నవారికే పథకాలు అనే పరిస్తితి. ఇక ఇలాగే టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తే…ఆ ప్రజలే పార్టీని పక్కన పెట్టేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version