టీఆర్ఎస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌…

-

అధికార టీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన అధ్యక్ష పదవి ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. ఇక టిఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ భవన్ లో… నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 22వ తారీకు మూడు గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.

అయితే 22వ తేదీన మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే టిఆర్ఎస్ గ్రామ, మండల మరియు పట్టణ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన అనంతరం జిల్లా మరియు రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టడం ఉండి అధికార టీఆర్ఎస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version