పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో… ఉభయ సభల ను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాకౌట్ అయ్యారు. ఆరు రోజుల నుంచి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ.. పార్లమెంట్ లో నిరసనలు తెలిపారు టీఆర్ ఎస్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే…ఇవాళ లోకసభ లో స్పీకర్ పోడియం చుట్టుముట్టారు టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు. రైతులను కాపాడాలంటూ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన చేశారు. “సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం” తీసుకురావాలని నినాదాలు చేశారు టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రబి ధాన్యం సేకరణను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే.. టీఆర్ ఎస్ పార్టీ నేతల డిమాండ్ పై కేంద్రం దిగిరాలేదు. దీంతో ఉభయ సభల ను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు.