క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DC లోని యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని తాజాగా ఆవిష్కరిష్కరించారు. బంగారు వర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని వెండి, అల్యూమినియంతో తయారు చేసి బంగారు పూత పోసినట్లుగా తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గించిన కాసేపటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇదిలా ఉండగా… ఇటీవల అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇండియాతో పాటు చాలా దేశాలకు షాక్ ఇస్తున్నారు. అన్ని వస్తువులపై భారీగా సుంకాలను పెంచి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అధికంగా ఇండియాకు దెబ్బ పడుతోంది. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వస్తువుల పైన ట్యాక్స్ అధికంగా పడుతుంది. దీంతో అమెరికాకు దూరంగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు దగ్గర అవుతున్నారు.