ట్రంప్ డెసిషన్స్ ఎఫెక్ట్.. మరింత క్షీణించిన రూపాయి విలువ

-

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశాక రూపాయి విలువ క్రమంగా పడిపోతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కనిష్టానికి పరుగులు తీస్తున్నది. తాజాగా ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి పడిపోయింది.

చరిత్రలో తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రూ.87 దాటింది. కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థలో విస్తృత వాణిజ్య యుద్ధ భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 67 పైసలు క్షీణించి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 87.29 వద్ద రికార్డు స్థాయిలో క్షీణతకు గురైంది. రూపాయి క్షీణిస్తుండటంపై ఫైనాన్సిషయల్ ఎక్స్ పర్ట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version