బీసి కులగణన సర్వే రిపోర్ట్ ని ఉచ్చ పోసి తగల పెట్టాలి – తీన్మార్‌ మల్లన్న

-

బీసి కులగణన సర్వే రిపోర్ట్ ని ఉచ్చ పోసి తగల పెట్టాలంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్. ఇది అంతా మూకుముడిగా రెడ్లు అంత ఆడుతున్న డ్రామ అంటూ ఓ విలేకరితో చింతపండు నవీన్ మాట్లాడిన మాటలు వైరల్‌ గా మారాయి.

teenmar mallanna comments on BC Census Survey Report

ఇక అటు గాంధీ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. బీసీ కుల ఘనన విజయవంతంగా పూర్తి చేసి రేపు అసెంబ్లీ లో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సర్వేకు వస్తే కుక్కలను వదిలారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇంటికి వస్తే తలుపులు కూడా తీయలేదని… సర్వేలో వివరాలు ఇవ్వని 3.1% ప్రజల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ తీన్మార్‌ మల్లన్న మాత్రం సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version