పోలీసుల‌పై విశ్వాసం క‌లిగించాలి : కొత్త డీజీపీకి ఎంపీ ర‌ఘురామ లేఖ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులపై విశ్వాసం క‌లిగించేలా చేయాల‌ని నూత‌న డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజ్ లేఖ రాశారు. కాగ త‌న‌పై సీఐడీ దాడి చేసింద‌ని.. దీని పై మాజీ డీజీపీ గౌతమ్ స‌వాంగ్ కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. అయితే గౌత‌మ్ సవాంగ్.. తన ఫిర్యాదు పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు. నూత‌నంగా డీజీపీ అయిన సంద‌ర్భంగా.. పోలీసు వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం క‌లిగించేలా.. త‌న ఫిర్యాదు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ ర‌ఘు రామ లేఖ‌లో తెలిపారు.

కాగ త‌నపై సీఐడీ త‌ప్పుడు కేసులు పెట్టి.. చిత్ర హింస‌లకు గురి చేసింద‌ని అన్నారు. అంతే కాకుండా సీఐడీ అధికారులు తనపై దాడులు కూడా చేశారని ఆరోపించారు. త‌న పై దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నార‌ని లేఖ‌లో తెలిపారు. త‌న పై దాడి ఘ‌ట‌న పై లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా.. మాజీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ నివేదిక కోరినా.. స్పందించ లేద‌ని అన్నారు.

కాగ ప్ర‌స్తుతం లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కు త‌న పై జ‌రిగిన దాడి గురించి నివేదిక పంపించాల‌ని లేఖ‌లో కోరారు. త‌ప్పు చేసిన వారిని క‌ఠినంగా శిక్ష వేసి.. పోలీసుల‌పై విశ్వాసం పెంచాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version