Breaking News : మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నం..

-

మంత్రి కేటీఆర్‌ నేడు కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ జిల్లాలోని మెట్‌ప‌ల్లికి కూడా వెళ్లారు. అయితే కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రైతు సంఘం నేత‌ల నుంచి నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌వుతాయ‌న్న స‌మాచారంతో పోలీసులు రైతు సంఘం నేత‌ల‌ను ముంద‌స్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

వారిలో నారాయ‌ణ రెడ్డి అనే రైతు సంఘం నేత కూడా పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే ఉన్నారు. సాయంత్రం వేళ మెట్‌ప‌ల్లి చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్ రైతు సంఘం నేత‌లు ఉన్న పోలీస్ స్టేష‌న్ ముందు నుంచే వెళుతోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నారాయ‌ణ రెడ్డి… ప‌రుగు ప‌రుగున పోలీస్ స్టేష‌న్ గేటు వ‌ద్ద‌కు చేరుకుని కేటీఆర్ కారుపై చెప్పు విసిరేందుకు య‌త్నించాడు. అయితే పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ పెద్ద‌దిగా ఉండ‌టంతో నారాయ‌ణ రెడ్డి గేటు చేరుకోక‌ముందే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నారాయ‌ణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version