తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు 2500 లకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే… విద్యా సంస్థల సెలవులను పొడగిస్తూ… కేసీఆర్ సర్కార్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 30 వరకు తెలంగాణ విద్యా సంస్థలకు సెలవులు ఉండనున్నాయి. అలాగే… రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరుగనుంది.
రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే… ఈ సమావేశంలో కరోనా విజృంభణ, కట్టడి, ఒమిక్రాన్ కట్టడి నియంత్రణ చర్యలపై కీలక చర్చ జరుగనుంది. ముఖ్యంగా నైట్ కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విధిస్తే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై కేబినేట్ చర్చి నిర్వహించనుంది. ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చింనుంది. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు కేబినేట్ నిర్ణయం ఉంటుందని సమాచారం అందుతోంది.