తెలంగాణ ఆర్టీసీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ టీఎస్ ఆర్టీసీ బస్సులలో శాశ్వతంగా ఉచిత ప్రయాణం ఉండేలా తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఎండీ సజ్జనార్ ఉన్నారు. కేక్ కట్ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సులలో 12 ఏళ్ల లోపు పిల్లలకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ నిర్ణయంలో తెలంగాణ ఆర్టీసీలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రయాణం చేస్తారని తెలిపారు. దీంతో టీఎస్ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కాగ ఇప్పటికే నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు మొత్తం 12 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు అని ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే ఉచిత సమయం అయిన పోయిన వెంటనే ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ శాశ్వత ఉచిత ప్రయాణం గురించి ప్రకటించారు.