Breaking : టీఎస్‌ టెట్‌ ఫస్ట్‌ ‘కీ’ విడుదల..

-

తెలంగాణ రాష్ట్ర వ్యా‌ప్తంగా ఈ నెల 12వ తేదీన ఉపా‌ధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరిగిన సంగ‌తి తెలిసిందే. పేప‌ర్ -1, పేప‌ర్ -2కు సంబంధించిన ప్రాథ‌మిక కీని టెట్ క‌న్వీన‌ర్ బుధ‌వారం విడుద‌ల చేశారు. స‌మాధానాల‌పై అభ్యంత‌రాల‌ను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్‌సైట్ ద్వారా స‌మ‌ర్పించాలి. టీఎస్ టెట్ ప్రాథ‌మిక కీ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు. అయితే.. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల 12న ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలకు 90 శాతం హాజరు నమోదైందని కన్వీనర్‌ తెలిపారు.

ఉదయం జరిగిన పేపర్‌-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు. పటిష్టమైన భద్రాతా ఏర్పాట్లతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. టెట్‌ ఫలితాలు ఈనెల 27న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ వివరించారు. గత టెట్‌లతో పోలిస్తే ఈసారి పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version