టీఎస్పీఎస్సీ రద్దైన పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఏఈ, మున్సిపల్ ఏఈ, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 28,19న సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష, 20న మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనుంది. పలు ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం సెప్టెంబర్ 12న నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. పేపర్ లీక్ కారణంతో గత మార్చి 5న పరీక్షలు రద్దైన విషయం తెలిసిందే.
ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకాల ద్వారా 9,370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇవికాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.. దీంతో మొత్తం 18,684 టీచర్ ఉద్యోగ ఖాళీలు ప్రస్తుతం కలవు. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.