నేడు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ బృందం వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, వారి సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరింది. ఈరోజు ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆమెను కలవడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక వీఆర్ఏను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని విన్నపించుకున్నారు.
వీఆర్ఓ వ్యవస్థ రద్దు తర్వాత క్షేత్ర స్థాయిలో వివిధ రకాల ధృవపత్రాల విచారణ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక రకాల సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ప్రభుత్వ భూములు, చెరువుల సంరక్షణలో కింది స్థాయి రెవెన్యూ అధికారులకు సహాయకులుగా ఉన్నారని వారు తెలిపారు. అత్యవసర విధులు, ప్రోటోకాల్ విధుల్లో గ్రామాల్లో అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రస్తుత రెవెన్యూ జాబ్ చార్ట్ నిర్వహణలో క్షేత్ర స్థాయి సిబ్బంది అవశ్యకత ఎంహెతగానో ఉందని తెలిపారు.