TTD Calendars: భ‌క్తుల‌కు అందుబాటులోకి కొత్త టీటీడీ డైరీలు.. క్యాలెండర్లు..

-

టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్దగల ధ్యాన మందిరం, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి.

విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం, దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version