టీటీడీ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి నో ఎంట్రీ..

-

ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో అన్యమత ప్రచారం సాగుతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామాగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ దేవస్థానం. భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామాగ్రి, తిరుమ‌లకు తీసుకురావడాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధం విధించింది అయితే ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నామని పేర్కొంది టీటీడీ.

టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు టీటీడీ తెలిపింది. ఇది ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌ అని, ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోందని టీటీడీ వెల్లడించింది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది. కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version