Tirumala : నేడు శ్రీవారి ఆర్జితసేవ, అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వేంకటేశ్వర స్వామి ఆర్జితసేవా, అంగప్రదక్షిణ టికెట్లను ఒక నెల ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా జూన్ నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 26 ఉదయం 11 గంటల వరకు ఆన్‌లైన్‌ డిప్‌లో పాల్గొనేందుకు భక్తులు తమ పేర్లను నమోదుచేసుకోచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు రుసుం చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

అదే విధంగా జూన్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. వీటితోపాటు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన కోటా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version