వర్చువల్‌ పద్ధతిలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం !

-

తిరుమల అంటే చాలు భక్తులపాలిట కల్పతరువు. ఆ స్వామి అనుగ్రహం కోసం పేద, ధనికా తేడా లేకుండా అందరూ స్వామి కొండపైకి వచ్చి స్వామిని దర్శిస్తారు. వారి కోరికలు తీరగానే స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. వీటిలో ఎక్కువగా శ్రీవారి నిత్యకళ్యాణం ఆర్జిత సేవ పేరుగాంచింది. అయితే కొవిడ్‌ మహ్మరితో భక్తుల కోరిక తీరడం లేదు. స్వామి కళ్యాణంలో పాల్గొందామంటే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా వివాహం చేసుకున్నవారు, స్వామి అనుగ్రహంతో ఉద్యోగం, సంతానం పొందినవారు ఎక్కువగా ఈ సేవకు ప్రాధాన్యం ఇస్తారు.

వీరందరికీ నేడు ఆ స్వామి కళ్యాణం అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో టీటీడీ బోర్డు త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో స్వామి వారికి జరిగే నిత్యకళ్యాణోత్సవాన్ని వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ విధానంలో భక్తులకు అందించనున్నారు. జూలై 31న తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ఇది సక్సెస్‌ అయిన వెంటనే నిత్యకళ్యాణాన్ని ఈ పద్ధతిలో నిర్వహించనున్నారు.

ఏది ఏమైతేనేమి భక్తుల చెంతకే స్వామి వస్తున్నారు. భక్తుల కోసం అవతారం ఎత్తిన ఆ శ్రీనివాసుడు అందరి ఇండ్లలో నిత్యకళ్యాణం చేసుకోవడం శుభపరిణామం. స్వామి అందరివాడు అని మరోసారి రుజువు చేయనున్నారు.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version