తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో ఇక ప్రైవేటు హోటళ్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై తిరుమలలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే రకమైన భోజనం ఉండేలా యాక్షన్ ప్లాన్ చేస్తోంది టీటీడి. తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించేలా నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి సర్వదర్శనాలకు త్వరలోనే అనుమతులు ఇస్తామని టీటీడీ నిర్ణయించింది. అన్నమయ్య నడకమార్గాన్ని డెవలప్ చేయాలని.. అలిపిరి దగ్గర ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని నిర్ణయించింది టీటీడీ పాలకమండలి. కేంద్రం అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మిస్తామని టీటీడి వెల్లడించింది.
అయితే ఈ హెటళ్ల తొలగింపు నిర్ణయంపై కొంత మంది విముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. శ్రీవారిని సందర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా… భారత దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు.. అయితే వీరందరి ఆహార అలవాట్లకు సంబంధించిన టీటీడీ ఆహారాన్ని అందించలేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.