తొలి టి20 టీం ఇండియా ఘన విజయం…!

-

టీం ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా జరుగిన తొలి టి20 మ్యాచ్ లో టీం ఇండియా విజయ౦తో కివీస్ పర్యటనను ఆరంభించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన కివీస్, టీం ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లను సొంత మైదానంలో ఆ జట్టు బ్యాట్స్మెన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, మున్రో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు.

గుప్తిల్ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మున్రో 42 బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సుల సాయంతో 59 పరుగులు చేసాడు. గుప్తిల్ అవుట్ అయినా సరే తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ తో కలిసి స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ కూడా దూకుడుగా ఆడాడు.

26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 51 పరుగులు చేసి భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 27 బంతుల్లోనే మూడు ఫోర్లు మూడు సిక్సుల సాయంతో 53 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహల్, దుబే, జడేజా తలో వికెట్ తీయగా శమీ 4 ఓవర్లలో 53 పరుగులు ఇవ్వడం విశేషం.

ఇక ఆ తర్వాత భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీం ఇండియా కివీస్ బౌలర్లను ఒక ఆట ఆదుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులే చేసి అవుట్ అయినా సరే మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ 27 బంతుల్లో మూడు సిక్సులు నాలుగు ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసాడు, మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ తో కలిసి స్వైర విహారం చేసాడు. ఇద్దరూ కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు.

ఎక్కడా కూడా సాధించాల్సిన రన్ రేట్ పెరగకుండా జాగ్రత్తపడుతూ ఇద్దరు దూకుడుగా ఆడారు. దూకుడుగా ఆడే క్రమంలో రాహుల్ ఇష్ సోది బౌలింగ్ లో సౌదీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కోహ్లి కూడా కాసేపటికి 32 బంతుల్లో ఒక సిక్స్ మూడు ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి తిక్నేర్ బౌలింగ్ లో గుప్తిల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ రెచ్చిపోయాడు.

29 బంతుల్లోనే మూడు సిక్సులు, 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసాడు. కోహ్లి అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివం దుబే దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ కాగా అయ్యర్, మనిష పాండేతో కలిసి స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించారు. దీనితో 19 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి టీం ఇండియా లక్ష్యాన్ని చేధించింది. మనీష్ పాండే 12 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 14 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. శివం దుబే 9 బంతుల్లో ఒక సిక్స్ ఒక ఫర్ తో 13 పరుగులు చేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version